హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మద్యం మత్తులో యువకుడు హల్‌చల్

ప్రకాశం: కనిగిరి పోలీస్ స్టేషన్ ముందు ఓ యువకుడు మద్యం మత్తులో హల్‌చల్ చేశాడు. గురువారం రాత్రి పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై పడుకుని నిరసన తెలిపాడు. తనను ఎవరో కొట్టారని వెంటనే వారిని అరెస్టు చేయాలని యువకుడు మద్యం మత్తులో కేకలు వేశాడు. కుటుంబ సభ్యులు ఎంత వారించినా యువకుడు నిరసన కొనసాగించాడు. పోలీసులు వచ్చి ఆ యువకుడిని రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు.