హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గాంధీజీ ఆశయాలును పాటించాలి'

SKLM: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో ఇవాళ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ప్రిన్సిపల్‌ డా.టి.గోవిందమ్మ మాట్లాడుతూ.. సత్యం,అహింస మార్గాలను అనుసరించి శాంతి, సహనంతో దేశ సమైక్యతకు కృషి చేయాలని సూచించారు. వైస్ ప్రిన్సిపల్ డా.సతీష్‌, అయ్యప్ప, వెంకటేశ్వరరావు తదితరులున్నారు.