KRNL: రుద్రవరం మండలంలోని కొండవాగు కాలువలో చేపలు పడుతున్న యువకులకు ఇవాళ 25 కేజీలకు పైగా బరువున్న భారీ చేప చిక్కింది. తెలుగు గంగ కాలువలో నీటి ప్రవాహం తగ్గడంతో పరిసర గ్రామాల ప్రజలు చేపల వేటకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో నన్నే చరణ్‌కు భారీ చేప లభించడంతో యువకులు ఆనందం వ్యక్తం చేశారు. మండలంలో ఇంత పెద్ద చేప ఎప్పుడూ దొరకలేదని స్థానికులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వలలోకి భారీ చేప..!


