ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న పలు ప్రభుత్వ, ప్రైవేట్ పరిధిలో ఉన్న గాంధీ విగ్రహాల వద్ద శుక్రవారం గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, అధికారులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలువురు మాట్లాడుతూ.. గాంధీ చూపిన మార్గం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని.. నేటి యువత ఆయన ఆశయ సాధనలో పయనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'యువతకు గాంధీజీ జీవితం ఆదర్శం'


