ASR: డుంబ్రిగూడలో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. జాతీయ రహదారిపైనా కుక్కలు అడ్డంగా రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు కుక్కల కారణంగా ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు తెలిపారు. గుంపులు గుంపులుగా తిరుగుతుండడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడదను నియంత్రించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'వీధి కుక్కల బెడద'


