PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు,ప్రజలు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.గాంధీజీ అహింస, సత్యాగ్రహం,శాంతి మార్గాలను స్మరించుకున్నారు.ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని గ్రామ పెద్దలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానికులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గుమ్మలక్ష్మీపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు


