హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

నెల్లూరు: బుచ్చి పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలోని ముంబై జాతీయ రహదారిపై ఉన్న గాంధీ విగ్రహానికి చైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి, నగర కమిషనర్ చిన్నబాబు పూలమాలవేసి నివాళులర్పించారు. స్వాతంత్య్రం కోసం శాంతియుతంగా పోరాటాలు చేసి నాడు స్వాతంత్య్రం రావడానికి కీలక పాత్ర పోషించారని కొనియాడారు. యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.