హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మిగనూరు డీఎస్పీగా ఆముదాల శ్రీనివాస

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు డీఎస్పీగా అనంతపురం జిల్లా గుంతకల్లు డీఎస్పీ ఆముదాల శ్రీనివాసను నియమిస్తూ రాష్ట్ర పోలీసు శాఖ డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్యను అన్నమయ్య జిల్లా రాజంపేటకు బదిలీ చేశారు. ఈ మేరకు పోలీసు శాఖలో బదిలీలు, నియామకాలు చేపట్టారు.