హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బంగారం కోసమే మహిళ హత్య.. నిందితుడు అరెస్ట్

తూ.గో: తాళ్లపూడికి చెందిన ఆదిలక్ష్మిని బంగారం కోసమే ఆటో డ్రైవర్ షేక్ యాకోబ్ హత్య చేశాడని కొవ్వూరు సీఐ కె. విజయబాబు తెలిపారు. అప్పుల బాధతోనే ఆమెను తాడిపూడి వద్ద అంతమొందించి, మృతదేహాన్ని గోదావరిలో పడేసి నిందితుడు లొంగిపోయాడన్నారు. గురువారం యాకోబ్‌ను అరెస్ట్ చేశామని, నదిలో మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోందని సీఐ వెల్లడించారు.