హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైక్ ఢీకొని వ్యక్తి మృతి

WG: ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు శివారు నారాయణపురంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన గుత్తుల మోహనరావు (60) బైక్ పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మోహనరావును తణుకులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇరగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.