హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జడ్పీ సిబ్బంది సమయపాలన పాటించాలి'

PLD: నరసరావుపేటలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలని కలెక్టర్, జడ్పీ ప్రత్యేక అధికారి కృతికా శుక్ల ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన తొలి సమీక్షలో జడ్పీ భూములు, బడ్జెట్, అభివృద్ధి పనులు, సిబ్బంది కేటాయింపుపై సమీక్షించారు. సమావేశంలో జడ్పీ సీఈవో, డీఎల్‌డీవోలు, సిబ్బంది పాల్గొన్నారు.