హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: మంత్రి

కోనసీమ: బీసీలకు 34% రిజర్వేషన్ జీవోను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రామచంద్రపురంలో గురువారం ఆయన మాట్లాడారు. కూటమి సర్కార్ 34% రిజర్వేషన్లకే కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. YCP నేతలే కోర్టుకు వెళ్లి ద్రోహం చేశారని, గతంలో వారి వల్లే 16,800 మంది బీసీలు పదవులు కోల్పోయారని విమర్శించారు.