హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిత్యావసర వస్తువుల ధరలు పెంచితే చర్యలు: జేసీ

W.G: నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా ఉండి ప్రజలపై భారం పడితే సహించబోమని జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ స్పష్టం చేశారు. భీమవరంలో వ్యాపారులతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆమె మాట్లాడారు. వ్యాపారులు తక్కువ లాభంతో నిత్యావసర వస్తువులను విక్రయించాలని సూచించారు. అధిక ధరలకు విక్రయిస్తే రైతు బజార్లు, చౌకధర దుకాణాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.