హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు పంచాయతీల్లో గ్రామ సభలు : కలెక్టర్

కడప జిల్లాలోని 629 గ్రామ పంచాయతీల్లో శుక్రవారం గ్రామసభలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. 2027–28 ఆర్థిక సంవత్సరానికి చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నీటి గుంతలు, రహదారులు, పంచాయతీ భవనాలు, శ్మశానవాటికలు, పండ్ల తోటలు, పశువుల కొట్టాలు, తదితర పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.