హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నేడు మద్యం , మాంసం దుకాణాలు బంద్ చేయాలి'

PPM: గాంధీ జయంతి సందర్భంగా ఇవాళ పాలకొండ పట్టణంలో మద్యం దుకాణాలు, మాంసం దుకాణాలు, రెస్టారెంట్లు మూసివేయాలని నగర పంచాయతీ కమిషనర్‌ నూకరాజా ఆదేశించారు. గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు సత్యం, అహింస మార్గంలో నడవాలని ఆయన సూచించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని పట్టణంలో ప్రశాంత వాతావరణం ఉండేలా ప్రజలు సహకరించాలని కోరారు.