ప్రకాశం: కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్స్‌లో శుక్రవారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపింది. ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. ప్రజాదర్బార్‌కు వచ్చే వారు ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతిని వెంట తీసుకురావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు కనిగిరిలో ప్రజా దర్బార్


