AKP: మునగపాక మండలం ఉమ్మలాడ సమీపంలోని గొడారి ఆనకట్ట రెగ్యులేటర్ల వద్ద పూడిక తీయించి రైతులకు సాగునీరు అందించాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కర్రీ అప్పారావు, సీపీఎం మండల కన్వీనర్ ఎస్.బ్రహ్మాజీ డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు గురువారం రెగ్యులేటర్లను పరిశీలించారు. కృష్ణంరాజు కాలువ ద్వారా 5 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'సాగునీటి కాలువలో పూడిక తీయించాలి'


