హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి'

ASR: అరకు అంగన్వాడీ కేంద్రం-2లో పోషణ మాసోత్సవం నిర్వహించారు. ఐసీడీఎస్ సీడీపీవో లక్ష్మి లావణ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు. గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.