సత్యసాయి జిల్లా పరిధిలో అనుమతులు లేని అనధికార లేఅవుట్లు, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టే నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పుడా వైస్ ఛైర్మన్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. పెనుకొండ డివిజన్ అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అనుమతులు లేని లేఅవుట్లను గుర్తించి, నోటీసులు ఇవ్వాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'అనధికార లేఅవుట్లపై కఠిన చర్యలకు ఆదేశం'


