హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు మాంసం విక్రయాలు బంద్

NDL: ఆళ్లగడ్డ పట్టణంలో అక్టోబర్ 2న మాంసం విక్రయాలు బంద్ చేయిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కిషోర్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆళ్లగడ్డ పట్టణంలో మాంసం విక్రయదారులకు నోటీసులు అందజేసినట్లు ఆయన తెలిపారు. పట్టణంలో శాంతి అహింస మార్గాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.