హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరి కోత మిషన్‌లో పడి ఆపరేటర్ మృతి

NLR: చేజర్ల మండలం ఎర్రబల్లిలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. వరి కోత కోస్తుండగా.. మిషన్లో పడి ఆపరేటర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేజర్ల ఎస్సై అయ్యప్ప తెలిపారు.