హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెక్కపై గాంధీజీ రూపం

AKP: గాంధీ జయంతిని పురస్కరించుకుని నక్కపల్లి మండలం చినదొడ్డుగల్లు గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు దార్ల రవి వినూత్నంగా గాంధీజీ రూపాన్ని చెక్కపై తీర్చిదిద్దారు. కర్ర చేతబట్టి నడుస్తున్న మహాత్ముడి ఆకృతితో పాటు ఆయన ముఖ కవళికలను చక్కగా చెక్కి కళానైపుణ్యాన్ని చాటారు. ఈ కళాఖండాన్ని రూపొందించేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టిందని తెలిపారు.