హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా వయోవృద్ధుల దినోత్సవం

VZM: ఇస్కాఫ్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం అమర్‌భవన్‌లో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. వయోవృద్ధులను కుటుంబ సభ్యులు జాగ్రత్తగా చూసుకోవాలని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ చట్టం–2007ను సమర్థంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.