BPT: గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న బాపట్ల పురపాలక సంఘ పరిధిలో చికెన్, మటన్ విక్రయాలు, జంతు వధను పూర్తిగా నిషేధిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించి దుకాణాలు తెరిచినా, మాంసం అమ్మకాలు జరిపినా పురపాలక చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాపారులు, ప్రజలు ఈ నిర్ణయానికి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'రేపు మాంసం విక్రయాలు, జంతు వధ నిషేధం'


