హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

E.G: సీతానగరం మండలం రామచంద్రాపురంలో ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఘాట్ మెట్ల వరకు రూ. 15 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శంకుస్థాపన చేశారు. భక్తులు, ప్రజలకు మెరుగైన రాకపోకల సౌకర్యం కల్పించేందుకు రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలన్నారు.