సత్యసాయి: యువతను చెడు వ్యసనాల వైపు ప్రేరేపించేలా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పుట్టపర్తి సీఐ యువరాజు హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ, వాహనాలు నడుపుతూ రీల్స్ చేసిన నలుగురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నలుగురు ఆకతాయిలకు సీఐ హెచ్చరిక


