కోనసీమ: అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర దేవస్థానానికి గత 20 రోజుల్లో హుండీల ద్వారా రూ.17,93,355 ఆదాయం సమకూరింది. గురువారం లెక్కించగా.. ప్రధాన హుండీ ద్వారా రూ.17,20,640, ఉత్సవ హుండీ ద్వారా రూ.49,369, అన్నప్రసాదం హుండీ ద్వారా రూ.23,346 లభించింది. అదనంగా 1.9 గ్రాముల బంగారం, 19 గ్రాముల వెండి, రెండు విదేశీ కరెన్సీ నోట్లు భక్తులు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
విఘ్నేశ్వరుని 20 రోజుల హుండీ ఆదాయం ఎంతంటే?


