AKP: దేవరాపల్లి మండలం మామిడిపల్లి గ్రామంలో పల్లె పండుగ–3.0లో భాగంగా మంజూరైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఇవాళ శంకుస్థాపన చేశారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ జేడీ, డ్వామా పీడీ, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పలు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే


