హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

SKLM: మెలియాపుట్టి మండలం గంగువాడ పంచాయతీలో రూ.2 కోట్ల అంచనాతో పల్లె పండుగ-3.0 పనులను పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గురువారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, రహదారుల నిర్మాణంతో రాకపోకలు సులభతరం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకట్రామన్, కూటమి నాయకులు పాల్గొన్నారు.