హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కళాజాత ప్రచార రథాన్ని పరిశీలించిన కలెక్టర్

NDL: గ్లోబల్ హార్టికల్చర్ హబ్–రాయలసీమ రైజింగ్ లక్ష్యాలు, ప్రయోజనాలను గ్రామీణులకు వివరించేందుకు నంద్యాల జిల్లాలోని 20 గ్రామాల్లో కళాజాత నిర్వహించనున్నారు. ఇందుకోసం సిద్ధం చేసిన ప్రచార రథాన్ని కలెక్టర్ రాజకుమారి గణియా ఇవాళ పరిశీలించారు. రైతులకు కలిగే ప్రయోజనాలు, ఉద్యాన రంగ అభివృద్ధిపై కళాజాత ద్వారా అవగాహన కల్పించాలని కళాకారులకు కలెక్టర్ సూచించారు.