హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రక్తదానం ప్రాణదానంతో సమానం'

SKLM: జిల్లాలో రక్తం కొరతను అధిగమించేందుకు యువత పెద్దఎత్తున రక్త దానానికి ముందుకు రావాలని ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. శ్రీకాకులంలోని ఓ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. మహిళా విద్యార్థినులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానం అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.