హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి'

KDP: సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పి. కొత్తపల్లి PHC వైద్యాధికారి డాక్టర్ మురళీమోహన్ సూచించారు. గురువారం మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల నివారణకు రాత్రివేళ దోమతెరలు వినియోగించాలని తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే సమీప ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని సూచించారు.