హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు మాంసం షాపులు బంద్!

 VSP: గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న జీవీఎంసీ పరిధిలోని అన్ని మేక, కోడి మాంసం, చేపల విక్రయ దుకాణాలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.