AKP: కోటవురట్ల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను మండల స్థాయి అధికారులు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి విద్యా బోధనపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఇందులో ఎంపీడీవో చంద్రశేఖర్, డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
హైస్కూల్‌ను తనిఖీ చేసిన అధికారులు


