ASR: కొయ్యూరు ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు గురువారం స్థానిక ఏపీటీడబ్ల్యూ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణపై ఆరా తీశారు. పాఠశాలలో పరిశుభ్రత పాటిస్తూ, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలను తనిఖీ చేసిన ఎంపీడీవో


