హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్నారుల మృతి పట్ల ఎమ్మెల్యే దిగ్భ్రాంతి

CTR: చిత్తూరు నగరం మంగసముద్రానికి చెందిన చిన్నారులు బాలాజీ, హరి బుడమాలచెరువులో మునిగి మృతి చెందడంపై ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని చిన్నారుల మృతదేహాలను పరిశీలించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.