హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మీ భూమి-మీ హక్కు'తో రైతులకు రక్షణ

SKLM: 'మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమం ద్వారా భూ యజమానులకు శాశ్వత హక్కులు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. మందస మండలం సువర్ణపురంలో లబ్ధిదారులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. మందస మండలంలోని ఆరు గ్రామాల్లో మొత్తం 3,143 పాస్‌పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి.శ్రీహరి, ఎంపీడీవో వై.వెంకటరమణ పాల్గొన్నారు.