హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాదంపూడిలో 'స్వచ్ఛతా హి' సేవా కార్యక్రమం

ELR: బాదంపూడి స్వర్ణ లో గురువారం స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు స్వచ్ఛతపై నినాదాలు చేస్తూ.. గ్రామ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. కార్యదర్శి గిరిధర్ విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. తడి చెత్త, పశువుల పేడతో నాడెప్ కంపోస్ట్ పిట్స్ నిర్వహణ, వర్మీ కంపోస్ట్ తయారీ విధానం వివరించారు.