హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శిథిలావస్థకు చేరిన దుకాణాల తొలగింపు..!

NTR: విజయవాడ సింగ్‌నగర్ స్టేడియం షాపింగ్ కాంప్లెక్స్‌లో శిథిలావస్థకు చేరిన ఖాళీ దుకాణాలను VMC అధికారులు తొలగించారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజల భద్రత దృష్ట్యా ఎస్టేట్, టౌన్‌ప్లానింగ్, ఎన్‌క్రోచ్‌మెంట్ సిబ్బంది సమన్వయంతో డెమాలిషన్ చేపట్టారు. నగరంలోని ప్రమాదకర నిర్మాణాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.