హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీఆర్ఎల దీక్షలకు ఏఐటీయూసీ మద్దతు

TPT: వీఆర్ఎల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తిరుపతి కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాకు ఏఐటీయూసీ మద్దతు తెలిపింది. వీఆర్ఎలకు నెలకు రూ.26 వేల వేతనం, రెగ్యులర్ పే స్కేల్ అమలు చేయాలని, అర్హులకు ప్రమోషన్లు కల్పించాలని జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. నామినీలను వీఆర్ఎలుగా కొనసాగించాలని కోరారు.