హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్త పెన్షన్లు త్వరలో మంజూరు: ఎమ్మెల్యే శ్రావణి

ATP: శింగనమల మండలం చీలేపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తులను పరిశీలించి, త్వరలో పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు. మంజూరు అనంతరం పంపిణీ కార్యక్రమం చేపడతామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.