హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామీణ బ్యాంక్ మేనేజర్ తీరుపై రైతుల ఆందోళన

KRNL: పత్తికొండ (మం) హోసూరులోని గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ.. రైతులు ఆందోళనకు దిగారు. రుణాలు, బ్యాంకింగ్ సేవల కోసం వచ్చిన రైతులను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించి, బ్యాంకు సేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.