KNR: కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రభాకర్ మానవత్వం చాటుకున్నారు. బస్సు దిగి బయటకు వెళ్లేందుకు, రోడ్డు దాటేందుకు ఇబ్బంది పడుతున్న ఓ అంధుడిని గమనించి ఆయన చేయూతనందించారు. అనంతరం అంధుడిని సురక్షితంగా రోడ్డు దాటించారు. కానిస్టేబుల్ ప్రభాకర్ చేసిన సేవను చూసిన స్థానికులు, ప్రయాణికులు అభినందించారు.
తెలంగాణ
అంధుడికి చేయూతనిచ్చిన కానిస్టేబుల్


