హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పత్తికొండకు స్వచ్ఛ గ్రామ పంచాయతీ అవార్డు

KRNL: పత్తికొండ మేజర్ గ్రామ పంచాయతీ రాష్ట్రస్థాయి ‘స్వచ్ఛ మేజర్ గ్రామ పంచాయతీ’ అవార్డుకు ఎంపికైందని ఎమ్మెల్యే కేఈ శ్యామ్‌కుమార్ తెలిపారు. డిప్యూటీ ఎంపీడీవో నరసింహులు, పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల కృషిని అభినందిస్తూ.. ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు. అధికారులు, ప్రజల సమన్వయంతో పత్తికొండ పరిశుభ్రంగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు.