హైదరాబాద్: 28°C
తెలంగాణ

కడెం ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు ఇలా..!

NRML: కడెం ప్రాజెక్టు నీటిమట్టం గురువారం ఉదయం 6 గంటలకు 700 అడుగుల పూర్తి స్థాయి వద్ద ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి 644 క్యూసెక్కుల నీరు వస్తుండగా 598 క్యూసెక్కులు బయటకు విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు. ఎడమ కాలువకు 495, కుడి కాలువకు 11 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. 18 గేట్లు మూసి ఉన్నాయని, ఇప్పటివరకు 949.6 మి.మీ వర్షపాతం నమోదైందని వెల్లడించారు.