JGL: గొల్లపల్లి మండలంలోని వెనుగుమట్ల గ్రామంలో బతుకమ్మ, దసరా ఉత్సవాలను పురస్కరించుకొని వాగు వద్ద చదును పనులను కొబ్బరికాయ కొట్టి గ్రామ నాయకులు ప్రారంభించారు. ఉత్సవాలకు వచ్చే మహిళలు, గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ
వాగు వద్ద చదును పనులు ప్రారంభం


