హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'క్రిమినల్ కేసులు పెట్టాలి'

VZM: బొబ్బిలిలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస జూట్ మిల్లు పరిధిలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ జిల్లా నేత కోట అప్పన్న డిమాండ్ చేశారు. ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను తొలగించి, అక్రమంగా ప్రహరీ గోడ నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు.