హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇల్లు మంజూరు చేసి నిర్మించే బాధ్యత నాది: MLA

JN: స్టేషన్ ఘనపూర్ 10వ వార్డు పరిధిలోని ఇందిరానగర్‌లో గుడిసెలు, కవర్లు కప్పి ఉన్న ఇళ్లు లేకుండా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పక్కా ఇల్లు నిర్మించే బాధ్యత నాదని MLA కడియం శ్రీహరి అన్నారు. ఇందిరానగర్‌లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లను నేడు ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.