BHNG: స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో ప్రతి గురువారం తిరుప్పావడ సేవను వైభవంగా నిర్వహిస్తున్నారు. సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండాలని స్వామివారికి అన్నకూటోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా సుమారు 450 కిలోల అన్నప్రసాదంతో పాటు లడ్డూ, వడ తదితర పిండి వంటలను నైవేద్యంగా సమర్పించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య అర్చనలు నిర్వహించారు.
తెలంగాణ
స్వర్ణగిరి క్షేత్రంలో వైభవంగా తిరుప్పావడ సేవ


