హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం'

ADB: గాదిగూడ మండలంలోని కుండి షేకుగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన తాగునీటి బావిని గురువారం గ్రామ పటేల్ సిడాం దౌలతరావు ప్రారంభించారు. తాగు నీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభించడంతో గ్రామ సర్పంచ్ బాదిరావు, ఉప సర్పంచ్ కుమ్ర భీంరావులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దుందిరావు, బాధిరావు, జైతు, తెలంగరావు, ఆనంద్ రావు, తదితరులు పాల్గొన్నారు.